Sunday, October 29, 2006

Sunday one-day

ఈ రోజు ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మేచ్ లో , ఆస్ట్రేలియా ఓడిపోతే ఇంటికి తిరుగు ప్రయాణం , ఇండియా జట్టు కి అయితే ఆ శ్రమ అక్కరలేదు పాపం, హోం గ్రౌండ్ లో ఆడితే అదే సుఖం మరి.
గ్రెగ్ చాపెల్ వెస్టిండీస్ పై చేసిన వ్యాఖ్యల వలన ఇప్పటికీ వాళ్ళు పౌరుషం తో ఆడు తున్నారని లారా కామెంట్ . ముఖ్యంగా ఇండియా తో. అలా అయితే మన ఆటగాళ్లకి ఆత్మాభిమానం , పౌరుషం లేవనా?? లేక పోతే చాపెల్ బాబాయ్ ఇంతవరకు మన వాళ్ళని ఛాలెంజ్ చేయలేదా ??
బహుశా ఆత్మాభిమానం, పౌరుషం తో పాటు టాలెంట్ కూడా కావాలేమో..
మొత్తానికి వన్డే మ్యాచ్‌లు " ఏ నిమిషానికి ఏమీ జరుగునో ఎవరూహించేదరూ ..' అన్నట్టుగా ఉన్నాయి అందులోనే మజా ఉందేమో మరి (మ్యాచ్ ఫిక్సింగ్‌లు లేకపోతే .. )

మన మీడియా వాళ్ళు జట్టు ని జట్టుగా ఉంచటానికి ఇష్టపడుతున్నట్టు లేదు. NDTV లో సచిన్ కి ఇంటర్వ్యూ లో ప్రశ్న. " మీ 194 స్కోరు వద్ద ద్రావిడ్ డిక్లేర్ చేయటం పై మీ అభిప్రాయం." మరిచిపోయిన గాయాన్ని రేపటం అంటే ఇదే.. ఆస్ట్రేలియా కోచ్, వాళ్ళ దేశం పై గెలిచేలా చిత్తశుధ్ధి తో మన వాళ్ళకి సలహాలు ఇస్తాడని ఆశిద్దం.
good luck to team India.

3 comments:

Sudhakar said...

ఈ ఆట చూస్తూ, ఒక రోజు వ్రుధా అయ్యింది నాకు...

ఇండియాకు సీను లేదు అని తెలిసినా నేనేల చూడవలే...
చూసితిని పో...ఆసీస్ కు చాలా సీను ఉందని తెలిసినా రెండవ ఇన్నింగు నేనేల చూడవలె :-(

simplefable said...

మీ బ్లాగ్ చూశాక సంతోషం వేసింది...తెలుగు లో మన వూహలు, భావాలు చెప్పుకోవడం ఎంత బాగుంటుంది అనిపించింది..శుభాకాంక్షలు

ఆసా said...

ఇక్కడ day light savings వలన బతికిపోయా సుధా.. ఇ౦డియా ఇన్ని౦గ్స్ మాత్రమే చూసాను. :)

venkatnath reddy గారు .. మీ ప్రోత్సహ౦ కి ధన్యవాదాలు.