Sunday, November 12, 2006

చాయ్ కబుర్లు - 2

సరదాగా ఒక రైలు ప్రయాణం ..
అది 1994 మే నెల చివరి రోజులు , డిగ్రీ 3 సం లోనికి కాస్త ధీమాగా అడుగుపెడుతున్న రోజులు. మరి మా సీనియర్స్ మాత్రం ఏ ఏ ఎంట్రన్స్ పరీక్షలు ఎక్కడ వ్రాయాలి అని గత 3 నెలలు గా ప్లాన్ చేసుకొని పరిగెడుతున్న రోజులు. అందులో నా సన్నిహితుడు ఒకాయన భాగ్యనగరంలో ఒక పరీక్ష కోసం సన్నాహాలు చేస్తూ , "ఏవోయ్ నీకు కాస్త పరిచయమున్న నగరం కదా నాతో రాకూడదు" అని అడగతమే తరువాయి , మ౦త్రి గారి అసెంబ్లీ సమావేశాల కన్నా ముఖ్యమైన పనిగా ఇంటిలో చిత్రీకరించి బయలుదేరటం జరిగింది. (అ౦దరి మ౦త్రులకి అసె౦బ్లీ సమావేసాలు అ౦త ముఖ్య౦ కాదనుకొ౦డి. అవి some 'వేషాలు' మాత్రమే..)

మా ఇద్దరికి జీవితం లో ఎలాంటి రిజర్వేషన్లు లేవు ( అదేనండి పుట్టకతో వచ్చేవి, అప్పుడప్పుడు ప్రభుత్వాలను పడగొట్టేవి) కానీ కష్టబడి ట్రైన్‌లో మాత్రం రెండు బెర్తులు సంపాదించాము. ఇంటినుండి తెచ్చినవి కాస్త తిన్నామనిపించి ఇక తాను చదివి మరిచిపోయినవన్ని మళ్లీ ఎలా గుర్తుంచుకోవాలో అనే ప్రయత్నంలో పుస్తకంలో మునిగిపోయాడు. (అసలు ఏమి మరిచిపోయామో ఎలా గుర్తుంటాయి గాని..) ఈలోగా ఒక అమ్మాయిల గు౦పు (6 మంది ఉంటరేమో) హాస్టల్లకు తిరిగి వెళ్తున్నట్టు ఉన్నారు ప్రతీ స్టేషన్ కి సంఖ్య పెరుగుతుంది. చూడటానికి 9, 10 తరగతి లా ఉన్నారు. అక్కడ బోగి లో అందరికి వినిపించేలా (బహుశా వినిపించాలనేమో) ఎవరి కబుర్లు వాళ్ళు , నెల రోజుల సెలవుల విషయాలు ఆ ఒక రాత్రి లో ముగించాలన్న తొందరలో పోటీపడుతున్నారు.

రాత్రి 11 అయి ఉంటుంది అమ్మాయల కబుర్ల ప్రవాహం తగ్గుతుందేమో అని అందరు లైట్లు ఆపి నిద్రకు ప్రయత్నిస్తున్నారు. పాపం నా నేస్తం మాత్రం ఒక లైట్ వెలుతురులో ఇంకా కుస్తీ పడుతున్నాడు. తుఫాను లా హెచ్చరిక లేకుండా అమ్మాయాల కబుర్లు ప్రవాహం తీరాలను దాటి వినిపిస్తుంది. విచిత్రం ఏమిటంటే అందరు ఎవరి బెర్తులలో వాళ్ళు పడుకోని , ఒక అమ్మాయి పై బెర్తు నుంచి సినేమా కధ వినిపిస్తుంది. దీనికి తోడు స౦దడిలో సడేమియా లాగ , మద్య మద్యలో ఇంకో అమ్మాయి స్క్రీన్ ప్లే సరిదిద్దటం. ఇలా ఒక 30 ని,, అయిన కధ పూర్తికాలేదు.
అసలు అంత మందికి వినిపిస్తుందని పాప౦ వాళ్ళకు తెలిసినట్టు లేదు. ఎవరైన చెప్తారులే అన్న ఆశ పోయింది. పోనీ నేనే చెప్దామంటే మళ్లీ లైట్లు వేసి రాత్రి పూట అదేదో రాద్దా౦తం ల ఉంటుందని ఒక ఆలోచన. బహుశా మిగత వాళ్ళు కూడా కధ వింటున్నరేమో అని ఒక అనుమాన౦, (ఇప్పుడు టెలీ సీరియల్ కధ మధ్యలో ఆపితే ఏమవు౦దో తెలుసుకదా) .

చివరికి ఎలాగో ఒక మంచి ఆలోచన వచ్చింది . పైన ఉన్న నా నేస్తాన్ని ఘాట్టిగా పిలిచా.. ఒక్కసారి కధ ఆగింది. "ఏమిరా అబ్బాయ్ చదువుతున్నావా లేక కధ వింటున్నావా.. ?? "అని అ౦దరికి వినిపి౦చేటట్టు అడిగా, పాపం వింటున్నాడో ఏమో కాస్త తడబడి లేదు అయిపోయి౦ది ఇ౦క పడుకొంటున్న అని లైటు ఆపేశాడు. చెప్పాలనుకొన్న విషయం చేరినట్టు ఉంది. ఇక కధ సమాప్తం అయింది.


ఇక 10 ని,, తర్వాత ను౦చి ప్రక్కనే పడుకొని వున్న ఒక పెద్దాయన తన కృతఘ్న్యతలను దాదాపు రాత్ర౦తా తెలుపుతునే వున్నాడు... తన గురక తో.. :(

మొత్తానికి మా వాడు పరీక్ష బాగానే వ్రాశాడు లెండి ప్రస్తుతం సైంటిస్టుగా ఉన్నాడు.


ఒరేయ్ బ్లాగులో ఎందుకురా ఈ బాగోతం ఎక్కించావని వాడు ఏమన్న అనుకొంటడేమో అని మొదట అనిపించిన, తన పేరు "కామేశం" అని నేనెక్కడ చెప్పలేడుకదా. ఫర్వలేదు. అయిన సై౦టిస్టు కదా ఈపాటికి మరిచిపోయి వు౦డాలి , ఆ ఘటన కాకపోయిన కనీస౦ తన రైల్ లో విన్న కధని. :- )

5 comments:

kamesh said...

కధ (జరిగినదే లెండి) చాలా బాగుంది. కధనం ఇంకా బాగుంది. ముక్తాయింపు మరీ మరీ బాగుంది. ఇలాగే రాస్తూ ఉండండి.

radhika said...

meeku caalaa telivitetalunnayandi.chaalaa baaga cepparu.pyna reply ichina kamesh garu mee kadhaloa kamesh gaaru okkarena?

kamesh said...

క్షమించండి. నేను ప్రొఫెసర్ ని కాదు. అందుకని ఇద్దరం వేరు వేరు. మరి ఆ కామేశం గారు ఎక్కడో?

Naveen said...

మీ స్నేహితుడి పేరు కామేశం అని మేము కూడా వినలేదు లెండి....మీ చాయ్ కబుర్లు అద్భుతంగ ఉన్నాయి.

- నవీన్ గార్ల
http://gsnaveen.wordpress.com

ఆసా said...

కామేశ్ గారు , ఒక్క క్షణ౦ మా కధానాయకుడు కామేశ౦ అనుకొని ఆన౦ద౦ తో కూడిన షాక్ తిన్నాను. :)
రాధిక గారు మీకు సమాధాన౦ దొరికొ౦ది అనుకొ౦టా ..
నవీన్ గారు , అసలు విషయ౦ అర్ధ౦ చేసుకొన్న౦దుకు ధ్యా౦క్స్ :)