Tuesday, January 08, 2008

"ఆసీ " మంకీ బిజినెస్..

ఏమిట్రా ఆ కోతి పనులు అందామనిపించి అయ్యో సిడ్నీ లో కదా వున్నాం జర బద్రం కొడకో అని ఎవడో కోతిగాడు హెచ్చరించి నట్టు వుంటే ఎందుకులే అని వూరుకొన్నాను.


నిజానికి ఆసీల పుట్టు పూర్వొత్తరాల గురుంచి తెలిసిన ఎవ్వడు అలా అనడు. తనది ఏ జాతియో ఇప్పటికి పూర్తిగా తెలియని వాళ్ళని పట్టుకొని మరీ "జాతి వివక్షత " తో మాట్లాడితే వాళ్ళు మాత్రం ఎలా సహిస్తారు??


ఆ మద్య "ఆస్ట్రేలియా ఓరియంటెషన్ కోర్స్" అని ఒక కోతి వెదవ క్లాస్ తీసుకొంటె , వెళ్ళి తెలుసుకొన్నది ఏమిటంటె.. వీళ్ళ తాత ముత్తాతలు ఇంగ్లాడులో దొంగతనాలు చేస్తూ పట్టుబడి ఇక్కడ ఖైదీలుగా తేబడ్డారట !!! వారితో బాటుగా కొందరు బ్రిటీష్ పోలీసులు కూడ కాపలాగ వచ్చారు.

ముత్తాతలు ఎట్టివారైనా సరే, వీళ్ళ తరాలకి పునాది అని ఇప్పటికీ.. ఎవరైనా వీళ్ళ కుటుంభంలో పూర్వీకులు 'దొంగలు ' అని చెప్పుకోవటానికి గర్వపడతారు. అది వినగానే అవురా వీళ్ళ గర్వం పాడుగాను అని నా మొబైల్ తీసి జేబులో పెట్టుకొన్నాను (ఎందుకైనా మంచిదని)..

అందుకనే ఇప్పటికి వీళ్ళకి ఏ గేములో నైనా ఇంగ్లాండ్ అంటే విరుద్దం . వేరే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు మాత్రం కాదు అనుకోండి ( ఇరాక్ యుద్దం, అది ఆయిల్ దొంగతనం కి కదా!!, గర్వ పడే చరిత్రే అది అయినప్పుదు ఇక సిగ్గు ఎందుకు ??)


ఇక జాతి వివక్షత సంగతికి వస్తే , 2003 డిసంబర్ 26 న మెల్బోర్న్ లో మేము, రోజంతా సెహవాగ్ బాటింగ్ చేసినప్పుడు వీళ్ళు చేసిన వ్యాఖ్యలు బహుసా మళ్ళీ వాల్లకి చూపించినా నమ్మరేమో !!


అడిలైడ్ టెస్ట్ ఇండియా గెలిచినప్పుడు రోడ్డు మీద తప్ప తాగి ఇక్కడ జనం వాగినది రికార్డ్ చేస్తే తెలిసేదేమో ..


మీడియా వాళ్ళు ఇక్కడ పని కట్టుకొని రోజు ఏదొ ఒక ప్రోగ్రం లో ముంబాయ్ లో మన మూక చేసిన చేస్టలు చూపిస్తూ ( FOX TV నక్కలాగ రహస్యంగా చిత్రీకరించనివి) వాళ్ళు చేస్తున్న ఆరోపణలను బలపరుచుకొంటున్నారు , కాదు కాదు బహుసా ఇక్కడ జనంలో అలజడి సృస్టిస్తున్నారు


ఇండియా cricket రివ్యూ అని ముఖ్యంగా మన రోడ్ల మీద తిరుగుతున్న పశువులు ,చెత్త , మురుగు కాలువలు .. . కాస్త గ్రౌండ్ లో పిల్లలు ఆడుతున్న క్రికెట్ , ఇదీ వారి చిత్రీకరణ.
వాళ్ళు ఇవన్నీ చేయటానికి ఒక దేశీ కోతి సహకారం అందించింది.


నాకు తెలిసి మన వాళ్ళు చాలా మందికి బానిసత్వం ఇంకా పోలేదు. అవతల వాడు తెల్ల తొక్క అయితే చాలు ఒంగి పోయి అన్నీ పనులు చేసిపెడతారు, (డాలరు విలువ కూడ కోతిలా ఆడిస్తుంది)..




ఏది ఏమైనా పరిమితులు దాటితే గతి తప్పినట్టే, చిన్నప్పటి నుండి ఎంతో ఆప్యాయమైనా ఆటకి దుస్తితి కలుగుతుంటే చాలా బాధగా వుంది.ఈ తతంగంలో నాకు నచ్చినధి మన క్యాప్టెన్ అనిల్ వ్యాఖ్య. తన తీరుకి, పదవికి పరిణితి వున్న వ్యాఖ్య.


బక్నర్ బాబాయ్ ని ఏమి అనదలుచుకోలేదు , ఎందుకంటె పిలిచి డాలర్లు ఇస్తాం నిల్చో అంటే , బెల్ట్ బిగించుకొని వచ్చేసాడు పాపం, తనకి మాత్రం ఏమి తెలుసు 67 సం" కూడ తనకి వినిపిస్తుందని , కనిపిస్తుందని (అదీ వరుసగా 5 రోజులు ) అందరూ ఇంకా 'ఆసీ 'స్తున్నారని.


ఒక రకంగా భజ్జీ కేసు వాళ్ళకే ఎసరు , నోరు మూసుకొని అవతల వాడిని కదిలించకుండా ఆడే అలవాటు ఆసీలకి లేదు , ఇక ఎప్పుడు నోరు విప్పిన తవ్వుకొన్న గోతిలో పడక తప్పరు !!



సరదాగా ..


వినికిడి ఏమిటంటే బక్నర్ కూడ "జాతి వివక్షత" ఆరోపణ పెట్టనున్నాడని , వ్యాఖ్య చేసిన తర్వాత భజ్జీ ని ప్రక్కకి పిలిచి అడిగాడుట , "నిజం చెప్పు!!! కోతి అని ఎవరిని అన్నావు ??" వెంటనే భజ్జీ తన స్తైల్ లో అడిగాడుట " నిజం చెప్పు బాబాయ్ కనపడక అడుగుతున్నవా ?? లేక వినపడక అని??" :-)


చివరిగా మ్యాచ్ రిఫరీ , కోతి వెదవ కాకపోతే అసలే మ్యచ్ లో బాల్ బ్యాట్ ని తాకిందొ, ఏది ప్యాడ్ ని తాకిందో తెలియక అంపైర్లు తికమక పడుతుంటే మద్యలో పిలిచి ఓవర్లు మద్యలో వాళ్ళిద్దరు ఏమి పోట్లాడుకొన్నరు అని ఆడిగితే , ఏమో మాకు తెలీదు పాంటింగ్ ని అడుగు అనక ఇంకేమి చెపుతారు.




ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడు కోతి కధలు , బోలెడు కోతి చేష్టలు ..

మొత్తానికి గత 7 నెలలుగా బ్లాగకుండా వున్న నన్ను కదిలించారు ఈ కోతి వెధవలు..

12 comments:

చదువరి said...

జాబు బాగా రాసారు. భజ్జీ, బాబాయ్ జోకు సూపరు!

Unknown said...

హహహ... బాగా రాసారు.
వెధవన్నర వెధవలు.
అసలు "ప్రొఫెషనలిజం" అనే పదానికి మరో పార్శ్వం ఉంటుందని చూపించారు.

తెలుగు'వాడి'ని said...

చదువరి గారు అన్నట్టు, భజ్జీ-బాబాయ్ జోకు సూపర్ ..హ హ్హ హ్హహ్హ హ్హ హ.. టపా చాలా బాగా వ్రాశారు.

ఇక పోతే మీరందరూ ఈనాడు లో వచ్చిన ఈ ఆర్టికల్ (బక్నర్ అంపైరింగ్ చేసే ప్రతి గంటకు రూ:17600 మరియు 34 రోజులకు 48 లక్షలు) చూసే ఉంటారు కదా...లేకపోతే ఒక సారి చదవండి.

రానారె said...

మొత్తానికి BCCI కదిలింది. BCCI కి ICC మీద ఎంత పట్టున్నా, ఇంత కాలం ఆసియా జట్లు అవమానాలను సహించ వలసి రావడం బాధ కలిగించేది. భారత జట్టు ఆత్మగౌరవం, భారతీయుల ఆత్మగౌరవం అంటూ శరద్‌పవార్ ఏదో అన్నాడీరోజు. చూడాలి ఏం చేయగలరో.

రవి said...

హ్హహ్హహ్హ..బక్నర్, భజ్జీ ...సూపర్..మా ఫ్రెండ్స్ ఇంకో రకంగా అంటున్నారు. భజ్జీ, వీణ్ణి కోతి అని, కోతి ని అవమానపరిచాడట. తన పంజాబీ స్టాండర్డ్స్ కి, ఆ తిట్టు, చాలా చిన్నది, తిట్టాలనుంటే, 'నీ....' అని వుండే వాణ్ణి అని ఒకటే ఫీల్ అవుతున్నాడట.

vennela said...

adentandi prathi okkaru vaallani kothi tho polchi daanikunna gouravaanni chadagoduthunnaru..oka australia patrikaithe ekanga symonds ni anjaneyaswami anthaveshadharanalo chupindi..ee rakamga manam vaallani poguduthunnamo,theguduthunnamo artham kaavadam ledu..kastha chepparu?

శాండిల్య said...

అయ్యా.. ఆసాయి గారు... మీరింత కసాయి వారనుకోలేదు..! నేనేదో పిల్ల కాకిని ఒక చిన్న బ్లాగ్ ని సృష్టించి...అందులో నా పేరు చూసుకుని సంతోషిద్దామనుకుని ఇక్కడికొస్తే...మీరేమో నాకంటే ముందే.. నా మనసుకి తట్టిన మాటని మీ బ్లాగ్ కి పేరు గా పెట్టేసుకున్నారు..! ఇది మీకు భావ్యమా..ఆహా..భావ్యమా అని అడుగుతున్నాను..! అయినా ఎప్పుడో 2008 లో బ్లాగ్ ని మొదలెట్టిన మిమ్మల్ని అని ఏం లాభంలే..! నాకీ ఆలోచన అప్పుడే రానందుకు నన్ను నేననుకోవాలి..!
మీరేమో మీ బ్లాగ్ లో పోస్ట్ లు అద్భుతంగా రాసేసారు.. నేనేమో మీకు ఫ్యాన్ ని అయిపోయాను..! కానీ ఏం చెయ్యను..ఎప్పుడో ఒకప్పుడు నేను కూడా ఒక ఫ్యాన్ కొనుక్కోవాల్సిందేగా.. అందుకని ఈ రోజు ఇక్కడికొచ్చి చూస్తే ఏముంది..ఇప్పటికే మీరు ఏలుతున్నారు..! ఇంక నాకు మిగిలింది ఒక్కటే... అబ్బ... ఫ్యాన్ కాదండి.... ఇంకో పేరు ని వెతుక్కోవటం..! ఇప్పుడదే పని లో ఉన్నాను..!

GARAM CHAI said...

what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
my youtube channel garam chai:www.youtube.com/garamchai

GARAM CHAI said...

బాగా చెప్పారు సార్...

తెలుగు వారి కోసం సరికొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబడినది
చూసి ఆనందించండి తెలుగు న్యూస్ మూవీ న్యూస్ ... వీక్షించండి ఆశీర్వదించండి

https://www.youtube.com/garamchai

Unknown said...

Good afternoon
its a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..
https://www.ins.media/

Unknown said...

Telugu news and updates
very nice blog
keep posting like this.:)

Unknown said...

nice post
www.youtube.com/channel/UCJMx6_3I6oTEC858UVMuyzg/videos
plz watch our channel.