Sunday, March 25, 2007

హలో from భవ్య

హలో .. నా పేరు భవ్య సాయి సంజన (అని మా నాన్న, అమ్మ చెప్పేరు.. నాకు నచ్చిందో లేదో నా భాష మీకు అర్ధమైనప్పుడు చెప్తా .. )
నాకు మాటలు ఇంకా రావని వీళ్ళ౦తూతారు. అసలు నా భాష వీళ్ళు చిన్నప్పుడు మాత్లాడినా ఇప్పుడు మర్చిపోయారు. దానికి మరి నేనేం చేయను.

మా నాన్న ఈ మద్య "కూడలి" అనే ప్రపంచంలో ఎక్కువుగా తిరుగుతున్నాలని విని , ఏమిటో చూద్దామని ఇలా వచ్చా!!! అమ్మోయ్ , 'అమ్మ' మాత్రమే లోక౦ అనుకొన్నా కాని ఇన్ని రకాలుగా వుంటుందని తెలియదు. నాకు నచ్చిన బొమ్మలు అయితే మరి ఎక్కడ కనిపించలేదు.

కొన్ని బ్లాగులు చూసిన తర్వాత తెలిసింది , తెలుగు, సంస్కృతి, క్రికెత్, రాజకీయం, లాజశేఖర రెడ్డి, తెలంగాణ, రుచికరమైన వంత, అమెరికా,బ్లాగటం మొదలైనవి లేకుండా ప్రపంచం లేదని. కొన్ని పదాల అర్ధాలైతే మీ భాష నేర్చుకొన్నాక అడగాలని వుంది . అర్దం చెప్తారు కదూ..

చాలా మంది అంకూల్స్, ఆంటీలు రాసినవి చూసి ఒకటి మాత్రం తెలిసింది మా నాన్నకి రాయతానికి బద్దకమని..సరేలేండి నేనైనా పలకరిద్దామని వచ్చాను కదా...

అవున్నట్టు ఈ మధ్య చుట్టుపక్కల , ఇంటిలో రాత్రి పూట 'అయ్యో వికెత్' 'చెత్త వెధవలు అవుతయ్యరు' , అనే కేకలు తగ్గాయి. ఇక వుండవని కూడా మా అమ్మ చెప్పింది. దీనికి సహాయ పడిన సచిన్, ధోని .. అంకూల్స్ కి , గ్లేగ్ తాతయ్యకి చాలా తాంక్స్.. వాళ్ళు ఎంచక్క వాళ్ళ పిల్లలు, మనువళ్ళతో ఇంటిలో బంతి ఆట ఆడుకోవచ్చు.

మా అమ్మ లేచే వేళ అయి౦ది ఇక వుంట ॥(ఏమిటి నేను ఇంత ముందే ఎలా లేచాననా ॥ ఇదొక మంచి అలవాటని మా తాతయ్య చెబుతూ౦తే విన్నాను। చిన్నప్పుడు మీకు ఈ అలవాటు వుండే వుంటుంది పాపం, భాష లా దానిని పెద్దయిన తర్వాత మరిచిపోవచ్చు అనుకొంటా..!!).

ఇక వుంట తా..తా... బై ..బై.. నా ఫోతో ఎలా వుందో చెప్పండే..

8 comments:

రాధిక said...

చో చ్వీట్ ...ఎన్నినెలలు పాపకి?

Unknown said...

వావ్ ఎంత క్యూట్ గా ఉందండీ మీ పాప. ఆడుకోడానికిస్తారా ?
అప్పుడే ఇన్ని మాటలు నేర్చింది, ముద్దు ముద్దు గా... భలే, మీ పాపకి ముద్దులు.

Sudhakar said...

బేబీ బ్యూతీ క్వీన్ అన్న మాత :-)

నేరేడు పళ్ళు నీ నీలాల కళ్లు...

రానారె said...

నీ ఫోటోకేమి తల్లీ, నీ లాగే నిమ్మళంగా ఆనందంగా ఉంది. నువ్వింతే ఆనందంగా హాయిగా ఎల్లకాలం జీవించాలని నా ఆశ. మీ తాతయ్య చెప్పిన మంచి అలవాట్లేవీ పెద్దయ్యాక మరచిపోకూడదు మరి :)

Kommireddi Pavan said...

అబ్బ...యి బుజ్జిది ఎంత బుజ్జి గా ఉందో...బుగ్గలు కొరికేసేంత..దానికి తోడు మీరు ఉపయోగించిన బాష చంటిదానికి బాగా సరిపొయింది..పిల్లలు దైవ స్వరూపులు అని విన్నాను..కానీ ఈ ఫొటో చూసాకే అర్ధమైంది నాకు.,.,ఆ కళ్ళలోని నిర్మలత్వం..ప్రశాంతత ..అబ్బ..ఇలా చెప్పుకుంటూ పోతే మీ పాపకి దిష్టి తగులుతుందేమో అని భయం.,.,బుడ్డి దాని పోస్ట్శ్ మటుకూ పోస్ట్ చేస్తుండండి..

ఆసా said...

మూడు మాసాలు నిండాయండి రాధిక గారు.
ప్రవీణ్, పవన్,సుధ ,రానారె : మీ కామెంత్స్, ఆశీర్వాదాలకి ధన్యవాదాలు.

vijju said...

బుజ్జి చాల బాగుంది... భవ్యంగా వున్నావురా.... అప్పుడే ఎన్ని మాటలు నెర్చావురా!

Unknown said...

nice article
https://youtu.be/2uZRoa1eziA
plz watch our channel