Sunday, April 01, 2007

ఈనాడు దిగజారుతున్నదా ??

ఏమి మీకు ఇంకా సందేహమా అని అడుగుతారేమో ??
నాకు ఊహ తెలిసినప్పటినుంచి దినపత్రిక రంగంలొ సంచలనాలు రేపుతూ , జర్నలిజంని క్రొత్తపుంతలు తొక్కించి ఆంధ్రావనిలో ఎదిగి ప్రక్క రాష్త్రాలకి కూడ విస్తరించిన ఈ దిగ్గజం ఇప్పుడు కేవలం "రామో"జికీయం గా మారుతుంది।
కేవలం రాజశేఖర రెడ్డి తో వచ్చిన విభేధాలతో శ్రుతి , గతి తప్పుతుంది.
ఇంతవరకు ఎవరకి అవసరం లేనివి , తెలియనవి వెలికితీసి మరీ మొదటి పేజీలో వేస్తున్నారు। అంత అన్యాయం జరుగుతుంటే ఇంత వరకూ నిద్రపోతున్నరా?? లేకపోతే అవసరం రాలేదా??

చివరికి వెర్రిమొహాళ్ళగ రాష్ట్రమంతా ప్రతీరోజూ పత్రిక కొనుక్కోని మరీ, సీరియల్ లాగా వాళ్ళిద్దరి తగువులు చదవాల్సిన
గతి పట్టింది। ఎలాగు ఆ విభేధాలు ఇంతలోగా తేలవు గాని జిల్లా ఎడిషన్ లాగ దీనికి ఒక ఎడిషన్ మొదలుపెడితే సరి। అది ప్రక్కన పడేసి మిగత వార్తలేమిటొ చదువుకోవచ్చు।
ऑनलाइन లో చదవటానికి ఇంత చిరాగ్గావు వుంది। పాపం రోజు కొనుక్కొని చదివే వాళ్ళగతి ఏమిటో ??
అసలు పత్రికా రంగంలో గట్టి పోటి లేక ఈ దుర్గతి।

5 comments:

Narsi said...

నాకు తెలుగు మీద ఉన్న అభిమానమో ఏమో కాని నేను ఏ దేశంలో ఉన్నా మొదటిగా ఈనాడు పత్రిక చదివే వేరేది చదివేవాడిని, అలాంటిది ఇప్పుడు నిర్జీవంగా తయారైన ఈ పత్రిక చూస్తేనే ఏవగింపుగా వుంది.


ఏది ఏమైన.. తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారి విశ్లేషాణాత్మక శైలి నాకు బాగా నచ్ఛింది.. వారు ఆసా గారు ప్రచురించిన ఈనాడు పత్రిక విషియాన్ని ఒక చూపు చూస్తే బాగుంటుందేమో...

వెంకట రమణ said...

ఈనాడు కొంత వరకు దిగజారిన విషయం వాస్తవమేగాని, మెదటి పేజిలోని రెండు మూడు వార్తలను మినహాయిస్తే మిగతా విషయాలలో ఇప్పటికీ తెలుగులో ఈనాడే ఉత్తమమైనదని నా అభిప్రాయం.

oremuna said...

సరిగ్గా వై యస్సార్ ఇదే కోరుకోని ఉంటాడు

ఈనాడు విశ్వసనీయతపై దెబ్బ తీస్తే ఇహ వ్రాసేవి ఎవరూ నమ్మరు కదా:)

Unknown said...

నేనూ ఈ మధ్య కొంత కాలంగా ఇదే అనుకుంటున్నాను.
చేతిలో పవర్ ఉంటే అది మంచికీ, చెడుకూ వాడచ్చనే దానికి ఇదో ఉదాహరణేమో.

ఈ మధ్య నేను ఆ న్యూస్ ని ఇగ్నోర్ చెయ్యడం మొదలెట్టాను. కానీ రమణ గారన్నట్టు ఇతర పత్రికలేవీ దరిదాపుల్లో లేక పోవడం తో ఈనాడు కి ఏ ఢోకా లేదు.

చదువరి said...

కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ లాగా, ఈనాడు బాధ మన బాధ అయినట్లుంది. మోతాదు తగ్గించవలసిన అవసరం ఉంది.
అయితే ప్రభుత్వ బెదిరింపులకు లొంగకుండా విమర్శలను కొనసాగించడం దాని విశిష్టత. అలాకాక, ఈనాడు లొంగిపోయి ఉంటే, ప్రభుత్వానికి ఎదురే లేకపోయి ఉండేది.